సినిమా పేరు - ట్యాగ్ లైన్ - రివ్

Home    |  Reviews  | LIVE Broadband  |  Lowband  |  Wallpapers

For Better View of Font Please follow the instructions here

  సినిమా పేరు - ట్యాగ్ లైన్ - రివ్
 
రాజు-మహరాజు - పబ్లిక్ టాక్

 

మోహన్ బాబు, శర్వానంద్ , రమ్యకృష్ణ, సుర్విన్ చావ్లా, తషు కౌశిక్  ఇతర నటీనటులు - జయప్రకాష్ రెడ్డి, జయసుధ, బ్రహ్మానందం,  ధర్మవరపు, సునీల్, ఎమ్మెస్ నారాయణ,  సుధ, సురేఖావాణి,

నిర్మాత - కుమార స్వామి పత్తికొండ , కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం - భాను శంకర్

నుబంధం ముఖ్యమా? ఆస్తి ముఖ్యమా? అనే సిట్యుయేషన్ వచ్చేసరికి ఆస్తి కోసం ధనికులు ఒక అడుగు వెనక్కి వేస్తారు. అదే మధ్య తరగతి వాళ్లయితే అనుబంధం కోసం పది అడుగులు ముందుకి వేస్తారు. ఇదే వాళ్ల మధ్య తేడా!" అన్నది ఈ సినిమాలో హీరోయిన్ స్టేట్ మెంట్. ఆస్తి కంటే అనుబంధం ముఖ్యం అనుకున్న ఓ అన్న, విచ్చలవిడి జీవితం నించి 'విజేత' లెవెల్ కి ఎదిగిన ఓ తమ్ముడు, మధ్యలో ఓ వదిన ... సింపుల్ గా ఇదీ స్టోరీ. ఇది ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం అని పబ్లిసిటీలోనే చెప్పారు. దానికి తగ్గట్టుగానే సినిమాలో సెంటిమెంట్ సెంట్ పర్సంట్ ఉంది. పాత సినిమా సీన్లు కొన్ని రిపీటయినా ఫస్టాఫ్ మంచి బిగితో నడిచింది. అయితే సెకండాఫ్ మరికొంత జాగ్రత్త తీసుకుని ఉంటే ఇంకా బావుండేది.
 

స్టోరీ
అనగనగా ఒక కుటుంబం. అన్నమోహన్ బాబు. తమ్ముడు శర్వానంద్. వదిన రమ్యకృష్ణ. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో ఉన్నంత గాఢమైన అనుబంధం వాళ్ల మధ్య ఉంటుంది. కానీ డబ్బుతో కేర్ లెస్ జీవితానికి అలవాటు పడ్డ శర్వానంద్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడు. అన్నయ్య కొత్తకారు కొనలేదని - కలియుగ పాండవుల్లో వెంకటేష్ లా తన కారునే తగలబెట్టేస్తుంటాడు. అమ్మాయిల మీద దాడులు చేసే దుర్మార్గుల్ని ఎదుర్కోవడం కోసం లైసెన్స్ డ్ గన్ కోసం అప్లై చేసే స్పీడున్న హీరోయిన్ సుర్విన్ చావ్లా. ఆమెని చూడగానే ప్రేమిస్తాడు శర్వానంద్. కానీ ప్రేమని డిమాండ్ చేసే క్రూరమైన అతని రౌడీ చేష్టలు ఆమెకి నచ్చవు. చివరికి నిర్లక్ష్యంతో ఆమె తండ్రిని కూడా యాక్సిడెంట్ చేసి చంపేస్తాడు శర్వానంద్. పగబట్టిన సుర్విన్ అతన్ని కేసునించి బయటపడేసేందుకు మోహన్ బాబు ఆస్తి మొత్తం కోరుతుంది. ఆస్తి ఆమెకు రాసిచ్చేశాక ఏం జరిగిందన్నది మిగతా సినిమా.

యాక్టర్స్
మోహన్ బాబు మంచి మెచ్యూరిటీతో నటించాడు. అఫ్ కోర్స్ ఇలాంటి కారెక్టర్లు కొట్టిన పిండే అయినా పాత్రకి తగ్గ పరిణతిని ప్రదర్శించాడు. శర్వానంద్ ఎక్స్ ప్రెషన్స్ బాగున్నా డైలాగ్ డెలివరీలో ఎప్పటిలాగే ఉన్నాడు. గమ్యం తరవాత దాదాపు అలాంటి కారెక్టరే కాబట్టి అతనికి పెద్ద కష్టమేమీ కాలేదు. సీనియర్ నటుడు మోహన్ బాబుతో ఇంటరాక్షన్ ఉన్న సీన్లు తక్కువ కావడం వల్ల అతని పెర్ఫార్మెన్స్ ని అంచనా వేయడానికి అవకాశం లేదు. ఇక హీరోయిన్ సుర్విన్ చావ్లా ముఖంలో మంచి భావాలు పలికించింది. యాక్షన్ తో బాటు అందం కూడా ఇంకొంచెం ఉంటే మరింత బాగుండేది. ఇక రమ్యకృష్ణ బాగా చేసింది. నాజర్ ఓకే. జయసుధ పాత్రకి ప్రాధాన్యం లేదు. రఘుబాబు పాత్ర వేస్ట్. జయ ప్రకాష్ రెడ్డి రొటీన్. బ్రహ్మానందం, ఎమ్మెస్, ధర్మవరపు, సునీల్ లకి నవ్వించే అవకాశం ఉన్న మంచి సీన్లు లేవు. ఉన్నంతలో ధర్మవరపు బెటర్.

డైరెక్షన్
సింపుల్ గా ఉన్న చిన్న కథని ఆసక్తి కరంగా చూపడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అయితే కథ మరీ పాత స్టయిల్లో ఉండడం, కొన్ని ముఖ్యమైన మలుపులు ఊహించేసేలా ఉండడం, మైనస్ పాయింట్లు. మధ్యలో సెంటిమెంట్ బరువుని తట్టుకోవడానికా అన్నట్టు కామెడీ సీన్లు, మసాలా సాంగ్స్ మిక్స్ చేశారు. అయితే ఇవి పండకపోవడం పెద్ద మైనస్ పాయింట్. తమ్ముడు పాడవుతున్నాడని చూచాయగా తెలిసిన అన్న అతనిమీద నిఘాకోసం బ్రహ్మానందాన్ని పెడతాడు. ఆ కామెడీ సీన్లు ఇంకా బాగా ఉండాల్సింది. అలాగే పిచ్చి చేష్టల యజమాని మహేష్ ఆనంద్ తో బాధలు పడే 'నంబర్ వన్' టైపు కారెక్టరే ఇందులో సునీల్ తో చేశాడు బ్రహ్మానందం. శుద్ధ బోర్.
 

ఇక కొన్ని సీన్లలో సెంటిమెంట్ ఎక్కువయింది. ఉదాహరణకి మోహన్ బాబుకి సురేఖావాణి రాఖీ కట్టే సీన్లో పసుపు-కుంకుమ డైలాగులు వగైరా... ఇక జయప్రకాష్ రెడ్డి యాక్షన్ సినిమా టైపు విలనా, ఫ్యామిలీటైప్ విలనా తేల్చుకోవడం కష్టం. అన్నదమ్ముల మధ్య రిలేషన్ గురించి మలుపులు, ఫ్లాష్ బ్యాక్ సీన్లు అనవసరం. దీంతో ఒకోసారి సెంటిమెంట్ కొంచెం ఓవర్ డోస్ అయినట్టు అనిపిస్తుంది.

మ్యూజిక్
సంగీతం అంత గొప్పగా లేదు. అయితే జేసుదాసు మార్క్ ఫ్యామిలీ సాంగ్ మాత్రం వినసొంపుగా చూసేలా ఉంది.

ఫైనల్ గా...
మంచి అన్న కారెక్టర్ తో రికార్డులు సృష్టించిన 'పెదరాయుడు' మోహన్ బాబు మరోసారి మంచి అన్నగా నటించిన చిత్రం ఇది. అయితే ఇందులో ఆయన విజృంభించడానికి స్టోరీ సహకరించలేదు. తమ్ముడి గురించి నిజం తెలిసి శిక్షించే దగ్గరో, హీరోయిన్ నించి, విలన్ల నించి కుటుంబాన్ని కాపాడే చోటో మోహన్ బాబు విజృంభిస్తాడని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే క్లయిమాక్స్ లో తమ్ముణ్ణి కాపాడాల్సిన చోట కూడా "అన్న చేత రక్షించబడే తమ్ముడిగా వాణ్ణి చూడాలనుకోవడం లేదు. తమ్ముడి చేత కాపాడబడ్డ అన్నగానే మిగిలిపోవాలనుకుంటున్నాను" అనే సెంటిమెంట్ డైలాగ్ తో - "ఇది మాస్ సినిమాకాదు, ఫ్యామిలీ సినిమా మాత్రమే" అని ప్రేక్షకుడికి చెబుతాడు. అంతే కాదు 'రాజు-మహరాజు' అన్న టైటిల్ చూడగానే ఒకరు మోహన్ బాబు, ఒకరు శర్వానంద్ అని ఫిక్సయిపోతాడు కామన్ ప్రేక్షకుడు. అయితే అతని ఎక్స్ పెక్టేషన్స్ ని తారుమారు చేస్తూ ఆ రెండూ శర్వానందే అని చెప్పి జస్టిఫికేషన్ ఇస్తాడు డైరెక్టర్.

పబ్లిక్ టాక్
అసందర్భంగా వచ్చే మసాలా పాటలు, పంచ్ లేని హాస్యం సీన్లు పట్టించుకోకుండా చూడగలిగితే - ఫ్యామిలీ చూడదగ్గ సినిమా.
 

Home    |  Reviews  | LIVE Broadband  |  Lowband  |  Wallpapers

  సినిమా పేరు - ట్యాగ్ లైన్ - రివ్

పబ్లిక్ టాక్

 

జనం మాటల ఆధారంగా ఎలాంటి పక్షపాతాలకూ తావు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కొత్త సినిమా రివ్యూలు అందిస్తోంది సాక్షి టీవీ డాట్ కామ్. ఈ పబ్లిక్ టాక్ పై మీ అభిప్రాయాల్ని cinireviews@sakshitv.com కి పంపించండి.

For Better View of Font Please follow the instructions here

 

Home    |  Reviews  | LIVE Broadband  |  Lowband  |  Wallpapers