| ఓయ్ - పబ్లిక్
టాక్ |
| సిద్ధార్థ, షామిలి ఇతర నటీనటులు -
నెపోలియన్, సునీల్, ప్రదీప్ రావత్, తనికెళ్ల భరణి, ఆలీ,
రావికొండలరావు, రాధాకుమారి సంగీతం -
యువన్ శంకర్ రాజా నిర్మాత -
దానయ్య డీవీవీ , , కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం -
ఆనంద్ రంగ,
రిలీజ్ డేట్ -
3 జులై 2009 |
రెండేళ్ల వయసులోనే అంజలిలో నటించి, అవార్డ్
అందుకున్న బేబీ షామిలి హీరోయిన్ గా అడుగుపెట్టిన తొలిసినిమా ఇది.
ఆలస్యంగా రిలీజయిన ఆమె స్టిల్స్ చూసి "అమ్మాయి బాగుంది. మరి
పెర్ఫార్మెన్స్ చిన్నప్పుడే చూశాం. సో... షామిలి కోసమైనా ఈ సినిమాకి
వెళ్లాలి" అనుకున్నవాళ్లు ఎందరో ఉన్నారు. మీరూ వారిలో ఒకరైతే ... నిజం.
మీకు ఆశాభంగం ఎంతమాత్రం కలగదు. అందంతో బాటు అభినయంలో కూడా మార్కులు
కొట్టేసింది షామిలి. అయితే సిద్ధార్థ హీరో కాబట్టి ఆ స్టయిల్లో ఉండే
రెగ్యులర్ యూత్ పిక్చర్ మీరు ఎక్స్ పెక్ట్ చేసి వస్తే మాత్రం ఊపిరి
కొంచెం బరువుగా తీయాల్సి ఉంటుంది.

స్టోరీ
సిద్ధార్థ ఓ టిపికల్ సిటీ కల్చరున్న కాస్ట్లీ అబ్బాయి. షామిలి సింప్లీ
ట్రెడిషనల్ అమ్మాయి. ఇద్దరి కల్చర్లలో అలవాట్ల తేడాల్ని
టైటిల్స్ నించీ ఎలివేట్ చేశాడు దర్శకుడు. పార్టీలూ ఎంజాయ్ మెంట్ అతని
స్టయిలయితే యోగ, పూజా పునస్కారాలు
హీరోయిన్ ఫిలాసఫీ. తప్పనిసరై ఓ పార్టీకి వచ్చి అక్కడ కూడా పుస్తకాలతో
కుస్తీ పట్టే షామిలి అక్కడ సిద్ధార్థ కళ్లలో పడుతుంది.
ఓ పెద్ద కంపెనీ ఓనర్ అయి ఉండీ సిద్ధార్థ, షామిలి ప్రేమ కోసం ఎన్నో
పాట్లు పడతాడు. చివరికి ఆమెను సొంతం చేసుకునే టైమ్
కి కథలో ఓ పెద్ద విలన్. (నటీనటుల లిస్ట్ లో ప్రదీప్ రావత్ పేరు చూసి తనే
విలన్ అనుకునేరు. కాదులెండి.ఇందులో కామెడీ
చేశాడు.) విలన్ లాంటి ఆ సమస్య తీరిందా? లేకపోతే వాళ్ల జీవితం ట్రాజడీగా
మిగిలిపోయిందా? అన్నది చూసి
తెలుసుకోవాల్సిందే.
యాక్టర్స్
సిద్ధార్థ ఎప్పటిలాగే ఈజ్ తో చేశాడు.'ఆట'సినిమా నాటికంటే ఇందులో
బావున్నాడు. ఇక షామిలి అన్ని విధాలుగానూ ఓకే.
అందం, టాలెంట్ రెండూ ప్లస్ పాయింట్సే. ఎక్కడా లిమిట్స్ దాటకుండా
అమ్మాయంటే గౌరవం కలిగేలా నటించింది.యూత్
సినిమాలకి ఓ కొత్త హీరోయిన్ దొరికినట్టే అనుకోవచ్చు.రెగ్యులర్ కమర్షియల్
సినిమాల్లో ఫిట్ అవుతుందా లేదా అన్నది
ఫ్యూచర్లోగానీ తెలియదు. సునీల్ నవ్వించాడు.సైకిల్ పడేసే అతని
ఇన్సూరెన్స్ అసిస్టెంట్ కూడా ఓకే.ఆలీ రెగ్యులర్.ప్రదీప్ రావత్
కొంచెం కామెడీ చేయడానికి ప్రయత్నించాడు. నెపోలియన్ పరవాలేదు.
డైరెక్షన్
చిత్రమేంటంటే ఇందులో హీరో వైపుగానీ హీరోయిన్ వైపుగానీ పాత్రలు చాలా
తక్కువ. కథంతా ఇద్దరి మధ్యే జరుగుతుంది.అలా
తక్కువ పాత్రలతో ఇంట్రస్టింగ్ గా కథ నడపడానికి చాలా చాకచక్యం ఉండాలి.ఈ
విద్యలో డైరెక్టర్ కి చాలా మంచి మార్కులు
పడతాయి. ఓ పెద్ద కంపెనీ ఎండీ అయి ఉండీ షామిలి ప్రేమకోసం సిద్ధార్థ
పాట్లు పడే సీన్లు చాలా బావున్నాయి.(గజిని సినిమా
చూడనివాళ్లకి ఇంకా బావుంటాయి.)అయితే సెకండాఫ్ లో డైరెక్షన్ చాలా
బాగున్నా కథ నీరసించిపోవడం బాధ కలిగిస్తుంది.

పాత్రల మధ్య రిలేషన్స్ కి సంబంధించిన సస్పెన్స్ విషయంలో పూరి జగన్నాథ్
సిద్ధహస్తుడు. ఒకటి రెండు చోట్ల అలాంటి జిమ్మిక్స్
బాగా చేశాడు డైరెక్టర్. హీరో హీరోయిన్ వేరేవాళ్లతో మాట్లాడుతున్న
మాటల్ని కలిపి ఎడిట్ చేయడం చాలా మంచి ప్రయోగం.
జనాన్ని కన్ఫ్యూజ్ చేయడమే కాదు, డైరెక్టర్ తాను కూడా కొంచెం కన్ఫ్యూజ్
అయ్యాడేమో అనిపిస్తుంది. జీవితాన్ని అనుభవిస్తూ
తేలిగ్గా తీసుకోవాలన్నది హీరో పాలసీ. సీరియస్ గా సిస్టమేటిగ్గా ఉంటూ
ఎంజాయ్ మెంట్ ని దూరంగా పెట్టడం హీరోయిన్ పాలసీ.
ఎవరి పాలసీ కరెక్టన్నది చెప్పడంలో క్లారిటీ లేదు.
(రావి కొండలరావు దంపతుల ఎపిసోడ్ కొంచెం అతి అనిపించింది
కూడా.) కానీ మధ్యలో సునీల్ లైఫ్
ఇన్సూరెన్స్ పాలసీ ఎపిసోడ్ బాగుంది. మొదట్లో కనిపించి
తెలుగు నేర్పుతానన్న తెలుగు మాస్టారు తనికెళ్ల భరణి మళ్లీ ఏమైపోయాడో
తెలియదు. ప్రదీప్ రావత్ ఛత్రపతి కామెడీ
పరవాలేదు. ఎక్కడా అసభ్యత,అశ్లీలత .. లైన్ దాటకపోవడం ఈ సినిమాలో మంచి
పాయింట్.
పంచ్ డైలాగ్
"ఎంత నటిస్తోందో... ఎంతయినా ఛైల్డ్ ఆర్టిస్ట్ కదా!" అని
సిద్దార్థకి ఓ డైలాగ్ కూడా ఉంది. బాగా పేలింది.
మ్యూజిక్
యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుంది. ఇళయరాజాని గుర్తుకు తెచ్చింది.
ఓయ్ ఓయ్ టైటిల్ సాంగ్ సిద్ధార్థ బాగా పాడాడు.
ఫైనల్ గా...
ఏదేమైనా సెంటిమెంట్స్ పలచబడిపోతున్న ఈ రోజుల్లో ఇంత డెప్త్ ఉన్నసీరియస్
సినిమా తీయడం గొప్ప విషయమే. యూత్ ఫుల్
గా ఉంటుందని జనం భావించే పిక్చర్లో ఇంత సీరియస్ నెస్ మిక్స్ చేయడం
సమంజసం కాదని కొందరికి అనిపించవచ్చు.కానీ ప్రతివిషయాన్నీ సిల్లీగా తీసుకునే యూత్ కి జీవితంలోని సీరియస్ నెస్ ని పరిచయం
చేసే సినిమా ఇది. అద్భుతమైన సినిమా తీసి
అందులో హీరోనీ హీరోనీ కలవనీయని క్రూరుడుగా పేరు తెచ్చుకున్న గ్రేట్
డైరెక్టర్ బాలచందర్. ఆ స్థాయిలో కాకపోయినా -
ఆనంద్ రంగ కూడా ఈ సినిమాతో డెప్త్ ఉన్న మంచి సీరియస్ డైరెక్టర్
అనిపించుకున్నాడు.

పబ్లిక్ టాక్
షామిలి, సిద్ధార్థల పెర్ఫార్మెన్స్ కోసమైతే ఈ సినిమా చూడచ్చు. అయితే
కేవలం అల్లరి చిల్లర యూత్ పిక్చరే కావాలంటే మాత్రం మీకు కావాల్సింది ఇది
కాదు. |