సినిమా పేరు - ట్యాగ్ లైన్ - రివ్

Home    |  Reviews  | LIVE Broadband  |  Lowband  |  Wallpapers

For Better View of Font Please follow the instructions here

  సినిమా పేరు - ట్యాగ్ లైన్ - రివ్

 

 
కరెంట్ - పబ్లిక్ టాక్

 

సుశాంత్, స్నేహ ఉల్లాల్  ఇతర నటీనటులు - తనికెళ్ల భరణి, సుధ, చరణ్ రాజ్, బ్రహ్మానందం

పాటలు - భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి సంగీతం - దేవిశ్రీ ప్రసాద్ నిర్మాత - చింతలపూడి శ్రీనివాసరావు , ఎ. నాగ సుశీల, , కథ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం - సూర్యప్రతాప్ , రిలీజ్ డేట్ - 19 జూన్ 2009

వ్ స్టోరీల్లో- హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ ఒకో సినిమాలో ఒకోలా ఉంటుంది. ద్వేషంతో స్టార్టవడం, ప్రేమతో కలిసే టైమ్ కి సీన్ మారిపోవడం.. ఇది రొటీన్. కరెంట్ లవ్ స్టోరీ కూడా ఇలాంటి లవ్ గేమే. కానీ మలుపులు కొంచెం ఎక్కువ. కథలో మలుపుల కంటే హీరో హీరోయిన్ల కారెక్టర్లలో కలిగే మార్పులే కథని లీడ్ చేస్తాయి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కన్విన్స్ చేయగలగడం వల్ల సినిమా బాగానే ఉందనిపిస్తుంది.

స్టోరీ
అచ్చం ఇడియట్ లో రవితేజ లాంటి సుశాంత్. అచ్చం ఐశ్వర్య రాయ్ లాంటి స్నేహ ఉల్లాల్. జీవితాన్ని సీరియస్ గా తీసుకోని సుశాంత్ స్నేహని మాత్రం సీరియస్ గా ప్రేమిస్తాడు. బెడ్ రూమ్ లోకి వెళ్లి కత్తి చూపించడం, అమ్మాయికోసం పైనించి కిందికి దూకడం లాంటి సాహసకార్యాలు చేస్తుంటాడు. ( ఇడియట్ గుర్తొస్తోందా? సారీ పూరీ... ఇవన్నీ ఈ సినిమాలో కలలో సంఘటనలు. కాబట్టి కాపీ అంటే కుదరదు.) హీరోని మొదట్లో హేట్ చేసే హీరోయిన్- సరిగ్గా తండ్రి పెళ్లి ఫిక్స్ చేసేనాటికి అతన్ని ప్రేమించి కథకి హెల్ప్ చేస్తుంది. కూతురి ప్రేమ విని కాంప్రమైజ్ అయిన తండ్రి కాబోయే అల్లుణ్ణి పరిచయం చేయమంటాడు. హీరో టైమ్ కి రాకుండా - లోకల్ గా ఐసీసీ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆడుతుంటాడు. అదీ ఓ కుక్కపిల్ల కోసం... అతని నిర్లక్ష్యం చూసిన హీరోయిన్ అతన్ని వద్దనుకుంటుంది. ప్రేమ కోసం తన కారెక్టర్ ని మార్చుకోనంటాడు హీరో. నీ మీద ప్రేమ నన్ను డిస్టర్బ్ చేస్తోందని హీరోయిన్ అంటే - ఏం పరవాలేదు. నా ప్రేమని నీ మనసులోంచి నేనే తీసేస్తా ... అంటాడు. ఈ కొత్త కాన్సెప్ట్ తో ఇంటర్వల్ బ్యాంగ్... తరవాత కథ ఎన్ని మలుపులు తిరిగిందనేదే సెకండాఫ్!

యాక్టర్స్
సుశాంత్ కాళిదాసులో కంటే ఈజ్ తో నటించాడు. అంత ఎఫెక్టివ్ గా కాకపోయినా అక్కడక్కడ నాగార్జున పోలికలతో కనిపించాడు. ఇక స్నేహ ఉల్లాల్ బాగా చేసింది. అయినా ఆ అందానికి ఆ మాత్రం నటన చాలు కాబట్టి హ్యాపీగా ఎడ్జస్టయిపోవచ్చు. కాళిదాసు సినిమాకి తమన్నా అందాలు ప్లస్ అయినట్టే ఈ లవ్ స్టోరీకి కి స్నేహ సౌందర్యం ప్లస్ అయింది. అన్నట్టు ఇందులో సౌందర్య  కూడా  - అఫ్  కోర్స్...  స్నేహ తల్లిగా ఫొటో ఫ్రేమ్ లో!. చరణ్ రాజ్ బాధ్యత గల తండ్రిగా బాగా చేశాడు. బ్రహ్మానందం మామూలే. హీరో తల్లితండ్రులుగా తనికెళ్ల భరణి, సుధ పాత్రలు ఓకే. బ్రహ్మానందం మామూలే. ఇందులో సీరియస్ గా కనిపించే షఫీ ఇందులో కామెడీ చేశాడు. పరవాలేదు.

డైరెక్షన్
ప్రాక్టికల్ ఈవెంట్స్ బేస్డ్ కాకుండా మైండ్ గేమ్ తో కథ నడపడం కొంచెం కష్టమే. మొదట్లో డ్రీమ్ గేమ్స్, తరవాత హేట్ గేమ్స్.. ఇలా రకరకాల మలుపులున్న ఈ కథని ఆ రకంగా డైరెక్టర్ బాగానే డీల్ చేశాడు. మైండ్ గేమ్ లాగే మెడిటేషన్ మీద కూడా డైరెక్టర్ కి మంచి నమ్మకం ఉన్నట్టుంది. ఇందులో హీరో ధ్యానం చేసి ఎవరెక్కడున్నారో కనిపెట్టేస్తుంటాడు. కుక్క పిల్ల, ఆడపిల్ల ... కాదేదీ ఈ మెడిటేషన్ కి అనర్హం ... లాజిక్ అడగద్దు. లవ్ పవర్ అనుకుని ఎడ్జస్ట్ అయిపోవడమే. అన్నిటికంటే ముఖ్యంగా - మంచి లవ్ స్టోరీ తీయాలనుకున్నప్పుడు - వేశ్యా గృహాలు, షకీలాతో అసభ్య దృశ్యాల్లాంటి చీప్ సీన్స్ తీయకుండా ఉంటే బాగుండేది.

మ్యూజిక్
దేవిశ్రీ మ్యూజిక్ ఎప్పటిలాగే ఉంది. రెగ్యులర్ గా దేవిశ్రీ అందించే ఫాస్ట్ బీట్ సాంగ్స్ కంటే స్లో సాంగ్ వినసొంపుగా ఉంది.

ఫైనల్ గా...
కరెంట్ అని ఈ సినిమాకి పేరుపెట్టడం కరెంట్ ట్రెండ్ ని ఫాలో అవడం కోసమే. అంతకి మించి టైటిల్ కి పెద్ద ప్రత్యేకత ఏమీ
లేదు. ప్రేమే ఆ కరెంట్ అన్న విషయాన్ని టైటిల్ డిజైన్లో, ట్యాగ్ లైన్లో మాత్రమే కాకుండా ఓ సాంగ్ లో కూడా వివరించారు. బలాదూర్ గా తిరిగినా, బాధ్యత లేకపోయినా హీరో ప్రేమించదగ్గవాడే అన్న నిత్య సత్యాన్ని కొత్త మలుపులతో చెప్పిన కథ ఇది.

పబ్లిక్ టాక్
మొత్తానికి కరెంట్ సినిమా బాగోలేదు అనాలంటే కారణాలు పెద్దగా కనిపించవుగానీ, చూడచ్చు అనడానికి మాత్రం సింగిల్ రీజన్ గా - స్నేహా ఉల్లాల్ ని చెప్పచ్చు.
 

Home    |  Reviews  | LIVE Broadband  |  Lowband  |  Wallpapers

  సినిమా పేరు - ట్యాగ్ లైన్ - రివ్

పబ్లిక్ టాక్

 

జనం మాటల ఆధారంగా ఎలాంటి పక్షపాతాలకూ తావు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కొత్త సినిమా రివ్యూలు అందిస్తోంది సాక్షి టీవీ డాట్ కామ్. ఈ పబ్లిక్ టాక్ పై మీ అభిప్రాయాల్ని cinireviews@sakshitv.com కి పంపించండి.

For Better View of Font Please follow the instructions here

 

Home    |  Reviews  | LIVE Broadband  |  Lowband  |  Wallpapers